అమితాబ్ బంగ్లాను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు
on Aug 7, 2021
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. ముంబై నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్ లతో పాటు అమితాబ్ బచ్చన్ ఇంటిని కూడా పేల్చి వేస్తామని ఆగంతకులు బెదిరించారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు తనిఖీలను ప్రారంభించారు.
ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్ కు శుక్రవారం రాత్రి కాల్ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతోపాటు.. జుహులోని అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు ఉంచినట్లు ఆగంతకుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆయా ప్రదేశాలకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని పోలీసు కమిషనర్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏదీ కనుగొనలేదని పేర్కొన్నారు. మరోవైపు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో పలువురు కోలీవుడ్ స్టార్ హీరోల ఇళ్ళకు సైతం ఇలాంటి బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే అవి ఆకతాయిల పని పోలీసులు తేల్చేశారు.
Also Read